ఒక సాధారణ ఆరోగ్యవంతుడైన వ్యక్తి రోజుకు తాను తీసుకునే మొత్తం కేలరీలలో చక్కెర 5% నుండి 10% కంటే మించకూడదు.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

పురుషులు రోజుకు గరిష్టంగా 9 టీస్పూన్ల (సుమారు 36 గ్రాములు) కంటే ఎక్కువ చక్కెర తీసుకోకూడదు.

Image Source: pexels

మహిళలు రోజుకు 6 టీస్పూన్లు అంటే (సుమారు 25 గ్రాములు మించి చక్కెర తీసుకోకూడదు.

Image Source: pexels

2 నుండి 18 ఏళ్ల లోపు పిల్లలు రోజుకు 6 టీస్పూన్ల కంటే తక్కువ చక్కెర తీసుకోవాలి.

Image Source: pexels

రెండేళ్ల లోపు పిల్లలకు అస్సలు చక్కెర ఇవ్వకపోవడమే మంచిది.

Image Source: pexels

మనం కాఫీ, టీలలో వేసుకునే చక్కెరతో పాటు బిస్కెట్లు, శీతల పానీయాలు, చాక్లెట్లలో ఉండే 'యాడెడ్ షుగర్స్' గురించి పక్కాగా లెక్క ఉండాలి.

Image Source: pexels

చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరిగి, అది కొవ్వుగా మారుతుంది.

Image Source: pexels

చక్కెర అతిగా వాడితే రక్తపోటు పెరిగి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.

Image Source: pexels

నిరంతరం చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్యాంక్రియాస్‌పై ఒత్తిడి పడి, టైప్-2 మధుమేహం వచ్చే అవకాశం ఉంది.

Image Source: pexels

పంచదారకు బదులుగా బెల్లం, తేనె లేదా ఖర్జూరం వంటి సహజ తీపి పదార్థాలను మితంగా వాడటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Image Source: pexels