ఫ్రెంచ్ కిస్‌తో వచ్చే వ్యాధులు గురించి తెలుసా?

Published by: Khagesh

ఫ్రెంచ్ కిస్ ద్వారా ఓరల్ హెర్పెస్‌ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

దీని వల్ల పెదవులపై, నోటి లోపల చిన్న చిన్న నీటి గుల్లలు, మంట పుట్టించే పుండ్లు వస్తాయి.

కిస్సింగ్ డిసీజ్ అని పిలిచే మోనోన్యూక్లియోసిస్‌ వస్తుంది.

దీని వల్ల అలసట, గొంతు నొప్పి, జ్వరం వస్తాయి.

హ్యాండ్, ఫుట్ అండే మౌత్‌ పేరుతో డిసీజ్‌ కాక్సాకీ వైరస్‌ వల్ల వస్తుంది.

దీని వల్ల నోటి లోపల బొబ్బలు, చేతులు, కాళ్లపై దద్దర్లు వస్తాయి.

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి సైటోమోగాలో వైరస్ వస్తుంది.

నోటిలోని స్ట్రెప్టోకోకస్‌ మ్యూటాన్స్‌ అనే బ్యాక్టీరియా ముద్దు ద్వారా వస్తుంది.

దీని వల్ల చిగుళ్ల వాపు, రక్తం కారడం, పళ్లు పుచ్చిపోయే ప్రమాదం ఉంది.

హెపటైటిస్ బి వైరస్‌ ఉన్నప్పుడు చిగుళ్ల నుంచి రక్తం రావడం వంటివి ఉన్నప్పుడు వ్యాప్తి చెందే ఛాన్స్ ఉంది.

కళ్లకు ఉండే కలకల వ్యాధి కూడా ఫ్రెంచ్ కిస్ ద్వారా వ్యాప్తి చెందవచ్చు.

మెదడు, వెన్నుపామును ఇబ్బంది పెట్టే మెనింగోకోకల్ బ్యాక్టీరియా ఫ్రెంచ్ కిస్‌ ద్వారా సోకుతుంది.

లాలాజలం ద్వారా HIV వ్యాప్తి చెందకపోయినా ఇద్దరి నోటిలోనూ చిగుళ్ల వ్యాధులు ఉండి రక్తం కారుతుంటే సోకే ప్రమాదం ఉంది.