జియో ట్రూ 5జీ సేవలు గుజరాత్‌లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభం అయ్యాయి.

జియో దాదాపు ఒక నెల నుండి దాని ట్రూ 5G నెట్‌వర్క్‌ను దశల వారీగా రోల్ అవుట్ చేస్తుంది.

గుజరాత్‌లోని 33 జిల్లా కేంద్రాల్లో ట్రూ 5G కవరేజీని అందించడం ద్వారా జియో కొత్త రికార్డు సృష్టించింది.

భారతదేశంలో 100 శాతం జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో జియో ట్రూ 5G కవరేజీని పొందిన మొదటి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది.

గుజరాత్‌లోని జియో వినియోగదారులు 1 Gbps+ వేగంతో 5జీని ఎంజాయ్ చేయవచ్చు.

దానికి వారి దగ్గర 5జీని సపోర్ట్ చేసే ఫోన్ ఉంటే సరిపోతుంది.

ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, వారణాసి, బెంగళూరు, హైదరాబాద్, మరిన్ని రాష్ట్రాలలో జియో 5జీ ఇప్పటికే అందుబాటులో ఉంది.

జియో వెల్‌కమ్ ఆఫర్ అక్టోబర్ ప్రారంభంలో మొదలయింది.

ఒక నగరంలో నెట్‌వర్క్ కవరేజ్ పూర్తయ్యే వరకు వినియోగదారులు బీటా ట్రయల్‌ని ఉపయోగించవచ్చు.

'జియో వెల్‌కమ్ ఆఫర్'కి ఆహ్వానం పొందిన వినియోగదారులు ఆటోమేటిక్‌గా జియో True 5G సేవకు అప్‌గ్రేడ్ అవుతారు.