మీకు తెలియని, అవసరం లేని లింక్‌లపై క్లిక్ చేయకండి.

అటువంటి లింక్ ఏదైనా వస్తే వెంటనే బ్లాక్ చేయండి.

థర్డ్ పార్టీ సోర్స్‌ల నుంచి ఫైల్స్, యాప్స్ డౌన్‌లోడ్ చేయకండి.

గూగుల్ ప్లేస్టోర్ నుంచి మాత్రమే యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోండి.

పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ లేని ఓపెన్ వైర్‌లెస్ నెట్‌వర్క్‌లను ఉపయోగించకండి.

ఫోన్‌లో బ్రౌజింగ్ చేసేటప్పుడు వీపీఎన్ ఉపయోగించండి.

ఒకే పాస్‌వర్డ్ ఎక్కువ వెబ్‌సైట్లకు ఇవ్వకండి.

2 స్టెప్ ఆథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోండి.

తెలియని మెయిల్ ఐడీ నుంచి ఏవైనా అటాచ్‌మెంట్స్ వస్తే ఓపెన్ చేయకండి.

ఫైల్ షేరింగ్‌కు డ్రాప్ బాక్స్, బాక్స్, వన్ డ్రైవ్, గూగుల్ డ్రైవ్ వంటి సర్వీసులు ఉపయోగించండి.