అతి తక్కువ ధరకే బంగారం కావాలా? తులం బంగారంపై రూ.20వేల వరకు డిస్కౌంట్‌ వస్తే ఎలా ఉంటుంది?

అయితే మీరు హిమాలయ రాజ్యం భూటాన్‌కు వెళ్లాల్సిందే. అక్కడ ఒక రాత్రి బస చేస్తే చాలు! ఆఫర్‌ వర్తిస్తుంది.

భూటాన్‌ సందర్శకుల్లో 70 శాతం మంది భారతీయులే. కొవిడ్‌ తర్వాత అక్కడ టూరిజం ఫీజు వసూలు చేస్తున్నారు.

విదేశీయులకు 200 డాలర్లు భారతీయులకు 20 డాలర్లు ఫీజు పెట్టారు. అంటే ఒక రోజుకు రూ.1200 వరకు చెల్లించాలి.

డబ్బులు చెల్లించడం ఇష్టంలేని భారతీయులు అక్కడికి వెళ్లడం మానేశారు. దాంతో భూటాన్‌ ఓ ఆఫర్‌ ఇస్తోంది.

భారత్‌లో తులం బంగారం రూ.61,000 ఉంటే దుబాయ్‌లో రూ.53,000, భూటాన్‌లో రూ.43,000కు దొరుకుతుంది.

విదేశాల నుంచి పురుషులు రూ.50వేలు, మహిళలు రూ.లక్ష విలువైన బంగారం టాక్స్‌ లేకుండా భారత్‌కు తీసుకురావొచ్చు.

భూటాన్‌లో ఒక రాత్రి అక్కడి టూరిజం శాఖ ధ్రువీకరించిన హోటల్లో రూ.1200 పెట్టి బస చేస్తే చాలు.

భారత్‌తో పోలిస్తే కనీసం రూ.20వేల డిస్కౌంట్‌తో బంగారం కొనేయొచ్చు. హాయిగా తెచ్చేసుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం! ఈ సారి దుబాయ్‌ బదులు భూటాన్‌ ట్రిప్‌కు ప్లాన్‌ చేయండి!!