దేశం కోసం గన్ పట్టిన మాజీ మిస్ ఉక్రెనియా ఆమె అందం ముందు ఎవరైనా దాసోహం కావాల్సిందే. చేప కళ్లతో మెరిసే మేని ఛాయతో మాయ చేస్తుంది అనాస్టాసియా లెన్నా. రష్యన్ల దాడికి తన దేశం విలవిలలాడి పోతుంటే చూడలేకపోయింది. చావో బతుకో తేల్చుకోవడానికి సిద్ధపడింది. హైహీల్స్‌ను తీసి పడేసి యుద్ద బూట్లను తొడుక్కుంది. ఏకే 47 వంటి పవర్ ఫుల్ ఆయుధం చేత పట్టి ఉక్రెనియా సైన్యంలో చేరింది. తన ఇన్ స్టా ఖాతాలో ‘ఉక్రెనియాను ఆక్రమించాలన్న అత్యాశతో బోర్డర్ దాటే శత్రువులను చంపడానికి నేను సిద్ధం’ అంటూ రాసుకొచ్చింది ఈ అందగత్తె. ఈ బ్యూటీ గతంలో మోడల్‌గా, టీవీ యాంకర్‌గా కూడా పనిచేసింది. ఉక్రెయిన్ సైన్యం ఈ బ్యూటీ ధైర్యానికి, తెగువకు సెల్యూట్ చేశారు.