FIFA వరల్డ్ కప్ 2022 ఫైనల్‌లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది.

అర్జెంటీనా తరఫున తన చివరి ప్రపంచకప్‌ను ఆడుతున్న లియోనెల్ మెస్సీ కప్‌తో కెరీర్‌ను ముగించాడు.

సాధారణ సమయంలో స్కోరు 2-2తో సమం కాగా, అదనపు సమయంలో స్కోరు 3-3తో సమమైంది.

ఆ తర్వాత పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా అద్భుత ప్రదర్శన చేసి విజయం సాధించింది.

23వ నిమిషంలోనే మెస్సీ పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి అర్జెంటీనాకు ఆధిక్యాన్ని అందించాడు.

13 నిమిషాల తర్వాత అర్జెంటీనా మరో గోల్ చేయడంతో మ్యాచ్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.

ఏంజెల్ డి మారియా అద్భుతమైన పాస్‌ను చక్కగా సేకరించి గోల్ చేసి స్కోరును 2-0కు పెంచాడు.

80 నిమిషాల తర్వాత కైలియన్ ఎంబాపే అర్జెంటీనాపై విధ్వంసం సృష్టించాడు.

వరుసగా రెండు నిమిషాల్లో రెండు గోల్స్ చేసి స్కోరును 2-2తో సమం చేశాడు.

అదనపు సమయంలో కూడా మెస్సీ, ఎంబాపే చెరో గోల్ చేయడంతో స్కోరు 3-3తో సమం అయింది.

ఆ తర్వాత పెనాల్టీలో అర్జెంటీనా 4-2తో ముందంజ వేసి విజయం సాధించింది.
(All Images Credits: FIFA Worldcup Instagram)