ఫిఫా ప్రపంచకప్ 2022లో మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో క్రొయేషియా 2-1తో మొరాకోను ఓడించింది.


అద్భుతమైన స్ట్రైక్‌తో మిస్లావ్ ఓర్సిక్ గోల్ సాధించడంతో క్రొయేషియా విజయం సాధ్యం అయింది.

ఏడో నిమిషంలో జోస్కో గ్వార్డియల్ గోల్ సాధించడంతో క్రొయేషియా 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే అచ్రాఫ్ దారి గోల్ చేసి స్కోరును సమం చేశారు.

42వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు మిస్లావ్ ఓర్సిక్ గోల్ చేసి ఆధిక్యాన్ని 2-1కు పెంచింది.

ఆ తర్వాత రెండు జట్లూ గోల్ సాధించలేకపోయాయి.

దీంతో మ్యాచ్ క్రొయేషియా వశం అయింది.

సెమీ ఫైనల్లో అర్జెంటీనా చేతిలో 3-0తో ఓడిపోయిన జట్టుకు క్రొయేషియా కోచ్ జాల్ట్కో దలిక్ ఐదు మార్పులు చేశారు.

ఆ మార్పులు మంచి ఫలితాన్ని ఇచ్చాయి.

మొరాకో నాలుగో స్థానంతో ఈ ప్రపంచ కప్‌ను ముగించింది.
(All Images Credits: FIFA Worldcup Instagram)