'ఎఫ్ 2'లో ప్రధాన పాత్రలను తీసుకుని కొత్త కథతో రూపొందించిన సినిమా 'ఎఫ్ 3'. వెంకీ, వరుణ్ 'ఎఫ్ 2' మేజిక్ రిపీట్ చేశారా? కథ: మంగ ఫ్యామిలీ చేతిలో మోసపోయిన వెంకీ, వరుణ్ లక్షలు పోగొట్టుకుంటారు. ఆ తర్వాత దొంగతనం చేస్తారు. డబ్బు కోసం బడా పారిశ్రామికవేత్త ఆనంద్ ప్రసాద్ ఇంటికి వెళతారు. అక్కడ ఏం చేశారు? ఏమైంది? అనేది సినిమా ఎవరెలా చేశారు?: వెంకటేష్ కామెడీ టైమింగ్‌తో అదరకొట్టారు. ఇమేజ్, స్టార్‌డమ్ పక్కన పెట్టి కొన్ని సీన్లు చేశారు. రేచీకటి సీన్లు బావున్నాయి. వరుణ్ తేజ్ నత్తి ఉన్న కుర్రాడిగా బాగా చేశారు. నత్తి వచ్చిన ప్రతిసారీ ఆయన చేసే మేనరిజమ్స్ బావున్నాయి. తమన్నా, మెహరీన్ రోల్స్ జస్ట్ ఒకే. సోనాల్ పాత్రకు ఇంపార్టెన్స్ లేదు. సునీల్, ఆలీ, 'వెన్నెల' కిశోర్ కొంచెం నవ్వించారు. దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ సోసోగా ఉన్నాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. టెక్నికల్‌గా ఏవరేజ్ ఫిల్మ్ ఇది. విశ్లేషణ: లాజిక్స్, స్టోరీ గురించి ఆలోచించకుండా వెళితే... జస్ట్ టైమ్‌పాస్ చేసే సినిమా. కొన్ని ఎపిసోడ్స్ నవ్వించాయి. సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ తెలుగులో హిట్ అయిన కొన్ని కామెడీ సినిమాల్లో సీన్లు గుర్తు చేస్తాయి. ఫైనల్ పంచ్: 'ఎఫ్ 3' కంటే 'ఎఫ్ 2' బావుంది. ఇందులో ఫన్ తక్కువ, ఫ్రస్ట్రేషన్ ఎక్కువ. అదీ సంగతి!