దేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే సింగర్ ఎఆర్ రెహమాన్. ఆయన ఒక్కో పాటకు రూ. 3 కోట్లు చార్జ్ చేస్తారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.



రెండో స్థానం స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్‌ది. శ్రేయా ఒక్కో పాటకూ రూ.25 లక్షలు వసూలు చేస్తారు.



మూడో స్థానం సునిధి చౌహాన్‌ది. ఆమె ఒక్కో పాటకు రూ. 18 లక్షలు వసూలు చేస్తారు.



ఖరీదైన సింగర్లలో నాలుగో స్థానం ఆరిజిత్ సింగ్‌ది- ఆయన ఒక్కో పాటకు 18 నుంచి 20 లక్షలు చార్జ్ చేస్తారు.



కాస్ట్ లీ సింగర్స్ జాబితాలో ఐదో స్థానం సోను నిగమ్‌ది - ఆయన చార్జ్ రూ. 15 నుంచి 18 లక్షలు



ఆరో ప్లేస్‌లో పాప్ సింగర్ బాద్ షా ఉంటారు. - ఆయన ఒక్కో పాటకు రూ.15 లక్షలు చార్జ్ చేస్తారు.



పంజాబీ స్టార్ దిల్జిత్ దోసాంజ్ ఏడో స్థానంలో ఉన్నాడు. ఆయన ఒక్కో పాటకు పది లక్షలు చార్జ్ చేస్తారు. ప్రోగ్రామ్‌కు అయితే రూ. 50 లక్షలు చార్జ్ చేస్తాడు.



ఎనిమిదో స్థానంలో పాప్ సింగర్ యోయో హనీసింగ్ ఉన్నారు. ఆయన ఒక్కో పాటకు రూ.10లక్షలు తీసుకుంటారని చెబుతున్నారు.



పాటలతోనే కాదు స్టేజ్ ప్రదర్శనలతోనూ హోరెత్తించే నేహాకక్కర్ తొమ్మిదోస్థానంలో ఉన్నారు. ఆమె కూడా రూ.పదిలక్షల వరకూ చార్జ్ చేస్తారు.



చివరి పదో ప్లేస్‌లో మికా సింగ్ ఉన్నారు. ఆయన కూడా రూ. పది లక్షలు ఒక్కో పాటకు వసూలు చేస్తారు.