వివాహం అంటే వ్యాపారం..ఉపాసన కామెంట్స్ వైరల్!

ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది

సమాజంలో పరిస్థితులపై కూడా స్పందిస్తుంటుంది ఉపాసన. లేటెస్ట్ గా పెళ్లి గురించి మాట్లాడింది

వివాహ బంధం పూలపాన్పులా ఉండదు..దాన్ని కూడా వ్యాపారంలా నిరంతర సమీక్షల ద్వారా మెరుగుపరచుకోవాలి

బంధం నిలవాలంటే ఇద్దరి మధ్య అవగాహన, భావప్రకటన చాలా ముఖ్యం అని చెప్పుకొచ్చింది ఉపాసన

చరణ్‌లో ఉన్న విలువలు, విశ్వాసం, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం ఎంతో ఇష్టం అని ప్రేమను వ్యక్తం చేసింది

బంధం ఉన్నతంగా ఉండాలంటే పరస్పర గౌరవం, అవగాహన అవసరం..చరణ్ వ్యక్తిత్వం వల్లే నేను ముందుకు సాగుతున్నా

నా ప్రతి దశలోనూ తను నాతోనే ఉన్నాడు...ఇలాంటి జీవితాన్ని జీవించగలగడమే నా విజయ రహస్యం

వారానికి ఒకరోజైనా డేట్‌నైట్‌ ఉండాలంటారు మా అమ్మ .ఆ టైమ్ లో టీవీ, ఫోన్ కి దూరంగా ఒకరిపై మరొకరు దృష్టిపెట్టాల్సిందే