కిరణ్‌ అబ్బవరంతో నిశ్చితార్థం, పెళ్లితో రహస్య గోరక్‌ పేరు ప్రస్తుతం మారుమోగుతుంది

ఆరేళ్ల రిలేషన్‌ అనంతరం రహస్య గోరక్‌-కిరణ్‌ అబ్బవరం ఒక్కటవ్వబోతున్న సంగతి తెలిసిందే

రాజావారు రాణివారు సినిమాతో రహస్య హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది

అయితే మొన్నటివరకు ఈమే పెద్దగా ఎవరికి తెలియదు,కానీ, కిరణ్‌ అబ్బవరంతో పెళ్లి వార్తతో ఒక్కసారిగా లైమ్‌లైట్లోకి వచ్చింది

దీంతో అంతా రహస్య వ్యక్తిగత విషయాలు, బ్యాక్‌గ్రౌండ్‌ గురించి ఆరా తీస్తున్నారు

రహస్య మన తెలుగు అమ్మాయే, తెలంగాణకు చెందిన కుటుంబ నేపథ్య కుటుంబం తనది

1995 మార్చి 3న హైదరాబాద్‌లో పుట్టింది, విద్యాభ్యాసం కూడా ఇక్కడే చేసింది

'బిర్లా ఇనిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ; పిలానీ' కాలేజీలో ఇంజనీరింగ్‌ కంప్లీట్‌ చేసింది

నటనపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చింది. కెరీర్‌ తొలినాళ్లలో ఆమె లక్స్‌ డ్రీమ్‌ గర్ల్‌ అందాల పోటీలో పాల్గొని టైటిల్‌ కొట్టింది

Image Source: All Image Credit: rahasya_gorak/Instagram

ఆ తర్వాత 'ఆకాశమంత ప్రేమ'(2016)అనే షార్ట్‌ ఫిలింతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది