గ్లామర్ డోస్ పెంచేసిన విష్ణుప్రియ- ‘సూసేటి‘ పాటకు ఊరమాస్ స్టెప్పులు విష్ణు ప్రియ గురించి బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘పోవే పోరా‘ లాంటి టీవీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఒకటి రెండు షోలకు యాంకరింగ్ చేసింది. యాంకర్ గా రాణిస్తూనే సడెన్ గా డ్యాన్సర్ గా మారిపోయింది. ‘జరీ జరీ పంచె కట్టి‘ అనే పాటకు బుల్లితెర నటుడు మానస్ తో కలిసి మాస్ డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఆ తర్వాత ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమాలో అందాల ఆరబోతతో ఆకట్టుకుంది. తాజాగా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు షేర్ చేసి కుర్రాళ్లను కవ్వించింది. ఇక ‘పుష్ఫ 2‘లోని ‘సూసేటి‘ పాటకు ఊరమాస్ స్టెప్పులతో అలరించింది. All Photos & Video Credit: Vishnupriyaa bhimeneni/Instagram