రష్మిక vs హన్సిక.. ‘సూసేటి’ పాటకు ఎవరు బాగా డ్యాన్స్ చేశారో చెప్పండి ‘పుష్ప 2‘ నుంచి విడుదలైన ‘సూసేటి’ పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ పాటకు నెటిజన్ల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో చేరింది అందాల తార హన్సిక. ‘సూసేటి’ పాటకు రష్మికను మించి డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం హన్సిక వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక కంటే హన్సిక బాగా డ్యాన్స్ చేసిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపైనా సందడి చేస్తున్నది హన్సిక. ఓ తెలుగు ఛానెల్ లో ప్రసారం అయ్యే డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. All Photos & Video Credit: Hansika Motwani/Rashmika Mandanna/Instagram