విదేశాలకు ప్రయాణించేందుకు వీసా అనేది ఆ దేశ ప్రభుత్వం అందించే అనుమతి పత్రం.

సింగిల్ ఎంట్రీ వీసా అనేది వీసా చెల్లుబాటు కాలంలో ఒకసారి మాత్రమే ఆ దేశంలో ప్రవేశించడానికి అనుమతిస్తుంది.​

డబుల్ ఎంట్రీ వీసా అనేది వీసా చెల్లుబాటు కాలంలో రెండు సార్లు ఆ దేశంలో ప్రవేశించడానికి అనుమతిస్తుంది.

డబుల్ ఎంట్రీ వీసా పొందడం, ప్రతి ప్రయాణానికి సింగిల్ ఎంట్రీ వీసా పొందడం కంటే ఖర్చు తక్కువ.

డబుల్ ఎంట్రీ వీసా, అదనపు వీసా దరఖాస్తుల అవసరాన్ని తగ్గించి, సమయం, శ్రమను ఆదా చేస్తుంది.

మన ప్రభుత్వం కూడా విదేశీయులకు టూరిస్ట్, బిజినెస్ , మెడికల్ కారణాల కోసం డబుల్ ఎంట్రీ వీసాలు అందిస్తుంది.

ఈ వీసాల చెల్లుబాటు కాలం 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు

డబుల్ ఎంట్రీ వీసా ఫీజులు చెల్లుబాటు కాలం ఆధారంగా ₹2,200 నుండి ₹12,700 వరకు ఉంటాయి.

ఏ వీసాకోసం అయినా ఆ దేశం యొక్క ఎంబసీ లేదా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.