అత్యంత శక్తివంతమైన అష్టాదశ శక్తి పీఠాలివే!



అష్టాదశ శక్తిపీఠాలు ఏవి, ఎక్కడున్నాయి,సుదర్శనం చక్రంతో ముక్కలైన అమ్మవారి శరీర భాగాల్లో ఏ భాగం ఎక్కడ పడిందంటే..



1.శాంకరి - శ్రీలంక
ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు కాని ఒక వివరణ ప్రకారం ఇది తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండొచ్చుని చెబుతారు.

2. కామాక్షి - కాంచీపురం
కామాక్షీ దేవి ఆలయం కాంచీపురం, తమిళనాడు ఉంది. ఇక్కడ సతీదేవి వీపు భాగం పడిందని చెబుతారు.



3. శృంఖల - ప్రద్యుమ్ననగరం
కోల్ కతాకు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం.

4. చాముండి - క్రౌంచ పట్టణం
ఈ ఆలయం మైసూరు, చాముండి పర్వతాలపై, కర్ణాటకలో ఉంది. ఈ ప్రదేశంలో అమ్మవారి కురులు ఊడి ఈపర్వతాలపై పడ్డాయని స్థల పురాణం



5. జోగులాంబ-అలంపూర్
ఇది తెలంగాణ రాష్టం అలంపూర్ లో ఉంది. సతీదేవి పైవరుస దంతాలు, దవడ భాగం పడినట్లు చెబుతారు.

6. భ్రమరాంబిక - శ్రీశైలం
సతీదేవి మెడ భాగం పడిన ప్రదేశమే శ్రీశైలం.ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇక్కడే పరమేశ్వరుని ద్వాదశ జోతిర్లింగ క్షేత్రంకూడా ఉండటం వల్ల ఈ ప్రదేశాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు



7. మహాలక్ష్మి - కొల్హాపూర్
ఆది పరాశక్తి ‘అంబాబాయి'గా కొల్హాపూర్, మహారాష్ట్ర వెలసింది. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు.

8. ఏకవీరిక - మాహుర్యం
మహారాష్ట్ర నాందేడ్ సమీపంలో, మాహుర్ క్షేత్రంలో వెలిసింది ఏకవీరికాదేవి.సతీదేవి కుడిచేయి పడింది ఇక్కడే.



9. మహాంకాళి - ఉజ్జయిని
మధ్యప్రదేశ్ ఉజ్జయిని ప్రదేశంలో సతీదేవి పై పెదవి ఊడిపడిందని దేవీ భాగవతంలో ఉంది. ఇక్కడ ఈ తల్లి మహంకాళీ రూపంలో ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి.

10.పురుహూతిక - పిఠాపురం ( ఆంధ్రప్రదేశ్)
ఇక్కడ సతీదేవి పీఠబాగం పడిన చోటు కాబట్టి, ఈ ప్రదేశానికి పిఠాపురం అనే పేరు వచ్చిందంటారు.



11. గిరిజ - ఒడిశా
ఒడిశా, జాజ్‌పూర్ లో వెలసిన అమ్మవారు గిరిజాదేవి. ఇక్కడ అమ్మవారి నాభి భాగం పడిందని ప్రతీతి.

12. మాణిక్యాంబ -ద్రాక్షారామం
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ద్రాక్షారామంలో సతీ దేవి ఎడమ చెంప భాగం పడింది. దక్షవాటికగా పిలిచే ఈ గ్రామం పంచారామక్షేత్రాల్లో ఒకటి.



13. కామరూప- గౌహతి
అసోం రాజధానికి గువాహటిలోని నీలచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారని స్థలపురాణం.

14. మాధవేశ్వరి -ప్రయాగ
అమ్మవారి కుడిచేతి వేళ్ళు ప్రయాగ, ఉత్తరప్రదేశ్ లో పడినట్లు చెబుతారు. ఇక్కడ సతీదేవిని అలోపీదేవిగా కొలుస్తారు.



15. వైష్ణవి - జ్వాలాక్షేత్రం
హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఉండదు..ఏడుజ్వాలలు నిరంతరం వెలుగుతుంటాయి.ఇక్కడ అమ్మవారి నాలుక పడిందని చెబుతారు.

16. మంగళ గౌరి - గయ
బీహార్ లోని గయా ప్రాంతంలో సతీదేవి స్తనాలు పడినట్టు చెబుతారు. ఈ అమ్మవారే మంగళగౌరీదేవి.



17.విశాలాక్షి - వారణాసి
సతీదేవి మణికర్ణిక (చెవి భాగం)వారణాసిలో పడిందని స్థలపురాణం.

18.సరస్వతి - జమ్ముకాశ్మీర్
అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు. పాక్ ఆక్రమిత కాశ్మీరులో ముజఫరాబాద్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.



(Images credit: Pixabay)