వానాకాలంలో జుట్టు ఊడుతోందా?



వానాకాలంలో చాలా మందికి జుట్టు ఊడే సమస్య అధికమవుతుంది. దాన్ని అడ్డుకునేందుకు ఇంటి చిట్కాలు పాటించండి.



మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి పేస్టులా చేసి మాడుకు పట్టించాలి. అరగంట పాటూ వదిలేసి స్నానం చేసేయాలి.



ఉల్లిపాయల్లో కూడా జుట్టు రాలడాన్ని ఆపుకోవచ్చు. ఉల్లిపాయల రసాన్ని మాడుకు పూయాలి.



మైల్డ్ షాంపూతో తలకు స్నానం చేసేయాలి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టు ఊడడం తగ్గుతుంది.



కొబ్బరి పాలను జుట్టుకు, మాడుకు పట్టించాలి. జుట్టుకు టవల్ కట్టేసి వదిలేయాలి.



పావు గంట పాటూ అలా వదిలేసి తరువాత తలస్నానం చేసేయాలి.



జుట్టు ఊడకుండా గుడ్డుతో తలకు మాస్క్ వేసుకోవాలి. గుడ్డు సొన, తేనె, ఆలివ్ ఆయిల్ కలిపి తలకు మాస్క్ లా వేయాలి.



ఆలొవెరా గుజ్జును కూడా తలకు పట్టించడం ద్వారా జుట్టు రాలిపోవడాన్ని అరికట్ట వచ్చు.