భర్త ఆరోగ్యంగా ఉండాలని, తన సంసారం నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో సాగాలని వధువు మెడలో ముక్కోటి దేవతల సాక్షిగా మూడు ముళ్ళు వేయిస్తారు వేదపండితులు.
మంగళసూత్రం స్త్రీ హృదయాన్ని తాకుతూ వక్షస్థలం కిందవరకూ ఉండాలి. మంగళసూత్రాలు బంగారంవి వేసుకున్నా మధ్యలో తాడుమాత్రం పసుపుదే ఉండాలి. ఎందుకంటే పసుపు కుంకుమలు సౌభాగ్యానికి చిహ్నాలు కాబట్టి.
మంగళసూత్రం పై బొమ్మలు గీయించడం, రంగులు దిద్దించడం చేయరాదు. దేవుడి ప్రతిమలు మంగళసూత్రంపై ఉండరాదని చెబుతారు. సూత్రానికి ఎరుపు, నలుపు పూసలు ఉండాలి.
మంగళ సూత్రాలకు చాలామంది పిన్నీసులు పెడతారు కానీ వాస్తవానికి సూత్రాలకు ఎలాంటి ఇనుము వస్తవు తగలకూడదు. ఇనుము నెగటివ్ ఎనర్జీని గ్రహిస్తంది.
మంగళసూత్రాలకు పిన్నీసులు పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీని గ్రహించడంతో భర్త అనారోగ్యం పాలవుతారని చెబుతారు.
హిందూ సంప్రదాయంలో ప్రతి ఆచారం వెనుక సహేతుకమైన కారణాలుంటాయి.
విశ్వాసం ఉన్నవారు వితండవాదం చేయకుండా ఫాలో అవడమే మంచిది. వాటిపై నమ్మకం లేనివారు ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. (Images Credit: Pinterest)