బిట్‌కాయిన్ 0.15 శాతం తగ్గి రూ.21.81 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 0.06 శాతం పెరిగి రూ.1,32,299 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.04 శాతం తగ్గి రూ.83.15, బైనాన్స్ కాయిన్ 0.19 శాతం తగ్గి రూ.17,680, రిపుల్ 0.37 శాతం తగ్గి రూ.41.43, యూఎస్‌డీ కాయిన్ 0.03 శాతం తగ్గి రూ.83.17, లిడో స్టేక్డ్ ఈథర్ 0.12 శాతం పెరిగి రూ.1,32,297, డోజీ కాయిన్ 0.39 శాతం తగ్గి రూ.5.03 వద్ద కొనసాగుతున్నాయి. మెయిన్ ఫ్రేమ్, టెల్లర్ ట్రైబ్యూట్స్, లుస్టిటియా కాయిన్, మూన్‌బీమ్, బ్లాక్స్, కాయిన్ 98, టెర్రా లాభపడ్డాయి. లూమ్‌నెట్‌వర్క్, వీమిక్స్, సెలో, అప్టోస్, ఏస్టర్, ఎక్స్‌డీసీ నెట్‌వర్క్ నష్టపోయాయి.