బిట్‌కాయిన్ 0.82 శాతం తగ్గి రూ.24.61 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 1.19 శాతం తగ్గి రూ.1,56,046 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.08 శాతం తగ్గి రూ.82.06, బైనాన్స్ కాయిన్ 0.43 శాతం తగ్గి రూ.19,860, రిపుల్ 0.42 శాతం పెరిగి రూ.61.09, యూఎస్‌డీ కాయిన్ 0.04 శాతం పెరిగి రూ.82.08, లిడో స్టేక్డ్ ఈథర్ 1.23 శాతం తగ్గి రూ.1,55,973, డోజీ కాయిన్ 0.06 శాతం తగ్గి రూ.5.67 వద్ద కొనసాగుతున్నాయి. ఓపెన్ ఎక్స్‌ఛేంజ్ టోకెన్, సీయూఎస్‌డీటీ, ఫ్లెక్స్ కాయిన్, రాల్‌బిట్ కాయిన్, కాన్‌స్టెల్లేషన్, సుయి, చైన్ లింక్ పెరిగాయి. లించ్, ఓక్స్ ప్రొటొకాల్, బ్లాక్స్, టెర్రా క్లాసిక్ యూఎస్డీ, బేసిక్ అటెన్షన్, టెర్రా, సెంట్రిఫ్యూజ్ నష్టపోయాయి.