బిట్‌కాయిన్ 0.60 శాతం తగ్గి రూ.24.74 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 1.33 శాతం తగ్గి రూ.1,56,537 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.22 శాతం పెరిగి రూ.82.30, బైనాన్స్ కాయిన్ 3.36 శాతం తగ్గి రూ.19,840, రిపుల్ 1.85 శాతం పెరిగి రూ.60.24, యూఎస్‌డీ కాయిన్ 0.12 శాతం పెరిగి రూ.82.22, లిడో స్టేక్డ్ ఈథర్ 1.36 శాతం తగ్గి రూ.1,56,418, డోజీ కాయిన్ 0.07 శాతం తగ్గి రూ.5.65 వద్ద కొనసాగుతున్నాయి. రాల్‌బిట్ కాయిన్, కాన్‌స్టెల్లేషన్, లించ్, ఓక్స్ ప్రొటొకాల్, సుషి, టెర్రా, కస్పా లాభపడ్డాయి. బ్లాక్స్, సీయూఎస్‌డీటీ, కోర్, కాంపౌండ్, లుస్కో, లిడో డావో, కడేనా నష్టపోయాయి.