అంతర్జాతీయ పురుషుల క్రికెట్ నిబంధనల ప్రకారం, బంతి బరువు 155.9 గ్రాముల నుండి 163 గ్రాముల మధ్య ఉండాలి.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

మహిళల క్రికెట్‌లో బంతి బరువు కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది 140 గ్రాముల నుండి 151 గ్రాముల మధ్య ఉంటుంది.

Image Source: pexels

చిన్న పిల్లలు ఆడే క్రికెట్ కోసం బంతి బరువు 133 గ్రాముల నుండి 144 గ్రాముల మధ్య ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి.

Image Source: pexels

పురుషుల క్రికెట్ బంతి చుట్టుకొలత 22.4 సెంటీమీటర్ల నుండి 22.9 సెంటీమీటర్ల మధ్య ఉండాలి.

Image Source: pexels

బంతి లోపలి భాగం కార్క్‌తో తయారవుతుంది. అల్లిన దారాల పొరలు ఉండి, చివరగా లెదర్తో కప్పి ఉంటుంది.

Image Source: pexels

టెస్ట్ క్రికెట్‌లో ఎరుపు రంగు , ODI/T20ల్లో తెలుపు రంగు బంతిని ఉపయోగిస్తారు. డే-నైట్ టెస్టుల కోసం పింక్ బంతిని వాడుతారు.

Image Source: pexels

తి మధ్యలో ఉండే కుట్టును 'సీమ్' అంటారు. ఇది ఆరు వరుసల కుట్టుతో ఉంటుంది.

Image Source: pexels

అంతర్జాతీయంగా మూడు ప్రధాన బంతులను వాడుతారు: కూకబుర్రా , డ్యూక్ , SG

Image Source: pexels

టెస్ట్ క్రికెట్‌లో ప్రతి 80 ఓవర్లకు ఒకసారి కొత్త బంతిని తీసుకునే అవకాశం ఫీల్డింగ్ జట్టుకు ఉంటుంది.

Image Source: pexels

క్రికెట్ బంతికి ఉండే ఈ కచ్చితమైన బరువు, గట్టిదనం వల్లే బౌలర్లు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో విసరడం సాధ్యమవుతుంది.

Image Source: pexels