తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను సీఎల్పీ నేతగా ప్రకటించింది. రేవంత్ రెడ్డి 1969 నవంబరు 8న నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో పుట్టారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తె గీతను వివాహం చేసుకున్నారు 2006లో మిడ్జిల్ జడ్పీటీసి సభ్యుడుగా విజయం, 2007లో ఇండిపెండెంట్ గా పోటీచేసి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ 2009లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపు 2014లో రెండోసారి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి 2014–17 మధ్య కాలంలో టీడీపీల్పీ ఫ్లోర్ లీడర్ గా సేవలు 2017 అక్టోబరులో టిడిపికి రాజీనామా, కాంగ్రెస్ పార్టీలో చేరిక 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా విజయం 2023 డిసెంబర్ 3న కొడంగల్ ఎమ్మెల్యేగా 3వ సారి విజయం డిసెంబర్ 5న సీఎల్పీ నేతగా నియామకం, ఈ 7న సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం