సమ్మర్‌లో గోల్డెన్ కలర్ దుస్తులు ధరించవచ్చా లేదా అని సందేహం ఉన్నవారు మౌనీ రాయ్‌ను చూసి ఇన్‌స్పైర్ అవ్వచ్చు. గోల్డెన్ కలర్ ప్లెయిన్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌస్.. సూపర్ హిట్ కాంబినేషన్ అని మౌనీ రాయ్ గుర్తుచేస్తోంది. బాడీకాన్ డ్రెస్సుల్లో డీప్ నెక్, గోల్డెన్ కలర్ చాలా బాగుంటుంది అనడానికే ఇదే ఉదాహరణ. ఈమధ్య హీరోయిన్లు ఎక్కువగా ఈ డిజైనర్ వేర్‌కు ఓటు వేస్తున్నారు. అందులో గోల్డ్ కలర్ కూడా బాగుంటుందని మౌనీ అంటోంది. గోల్డెన్ కలర్ లెహెంగా అమ్మాయిల అందాన్ని ఎంత పెంచుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాక్‌టెయిల్ పార్టీలకు ఫ్రాక్స్ కావాలంటే ఇలాంటి గోల్డన్ కలర్ మోడర్న్ వేర్ ట్రై చేయవచ్చు. బ్రౌన్ కలర్‌పై గోల్డెన్ బోర్డర్ ఒక డిఫరెంట్ కాంబినేషన్. పార్టీలకు, ఈవెంట్స్‌కు దీనిని ట్రై చేస్తే బాగుంటుంది. బ్యాక్ లెస్ గోల్డెన్ షిమ్మరింగ్ డ్రెస్.. పార్టీలకు బెస్ట్ ఆప్షన్. (All Images Credit: Mouni Roy/Instagram)