మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

అపోలో వ్యవహరాలను చూసుకుంటునే మరోవైపు సోషల్‌ సర్విస్‌లో యాక్టివంగా ఉంటుంది

ఇటీవల తన అత్తమ్మ, రామ్‌ చరణ్‌ తల్లి సురేఖతో 'అత్తమ్మాస్‌ కిచెన్‌' పేరుతో బిజినెస్‌ ప్రారంభించింది

ఈ నేపథ్యంలో ఇంట్లో పచ్చళ్లు చేస్తున్న వీడియోను తాజాగా ఉపాసన షేర్‌ చేసింది

సురేఖ ఆవకాయ తయారు చేస్తుంటే ఆమె అత్త అంజనమ్మ అ‍క్కడ కూర్చుని చూస్తూ ఉంది

నానమ్మ ఎందుకంత సీరియస్‌గా ఉన్నారు? అని అడుగుతుంది

దానికి అంజనమ్మ సీరియస్‌ ఏం లేదు పనిలేక ఖాళీగా కూర్చున్న అని చెబుతుంది

దీంతో ఉపాసన మీ కోడలు మంచిగా పచ్చడి(ఊరగాయ) చేయడం లేదా? అని అత్తమ్మ సురేఖపై ఫిర్యాదు చేయబోయింది

దానికి అంజనమ్మ నువ్వు ఉన్నావ్‌ కదా.. మళ్లీ కోడలికి ఎందుకు పని? అని సరదాగా కౌంటర్‌ ఇచ్చింది

Image Source: All Image Credit: upasanakaminenikonidela/Instagram

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది, వీరిమధ్య అనుబంధం చూసి మెగా ఫ్యాన్స్‌ అంత మురిసిపోతున్నారు