మహేంద్ర సింగ్ ధోని నెట్ వర్త్ రూ.1040 కోట్లుగా ఉంది. ఒక్కో ఐపీఎల్ సీజన్‌కు ధోని రూ.12 కోట్లు తీసుకుంటాడు. రాంచీలో ధోనికి ఒక విలాసవంతమైన బంగ్లా కూడా ఉంది. రాంచీలోనే ఏడు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఫార్మ్ హౌస్ కూడా ఉంది. వీటితోపాటు ముంబై, పుణే నగరాల్లో కూడా ఎన్నో ఆస్తులు ఉన్నాయి. మహేంద్ర సింగ్ ధోని ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నారు. వీటి ద్వారా ఏటా రూ.30 నుంచి 50 కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది. అలాగే ధోని దగ్గర ఎన్నో బైకులు కూడా ఉన్నాయి. వీటితో పాటు ధోని దగ్గర ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ధోని ప్రైవేట్ జెట్ ఖరీదు రూ.110 కోట్లు.