టాటా హారియర్ ఎక్స్‌జెడ్ డీజిల్ వేరియంట్ ధర సెకండ్ హ్యాండ్ రూ.13 లక్షలుగా ఉంది. మారుతి సుజుకి బ్రెజా వీడీఐ ధర సెకండ్ హ్యాండ్‌లో రూ.6.5 లక్షల నుంచి ఉండవచ్చు. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఏఎక్స్ఎల్ ధర రూ.17 లక్షల పైనే ఉంది. మహీంద్రా స్కార్పియో ఎస్9 ధర రూ.11 లక్షల వరకు ఉండవచ్చు. కియా సోనెట్ హెచ్‌టీకే ప్లస్ రూ.8 లక్షల వరకు ఉంది. కియా సెల్టోస్ హెచ్‌టీఎక్స్ వేరియంట్‌ను రూ.12 లక్షల ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. హ్యుందాయ్ వెన్యూ ఎస్ఎక్స్ మోడల్ ధర సెకండ్ హ్యాండ్ మార్కెట్లో రూ.7.5 లక్షలుగా ఉంది. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా ఎస్ఎక్స ధర రూ.10 నుంచి రూ.11 లక్షల మధ్యలో ఉంది.