నిఫ్టీ 4 పాయింట్లు పెరిగి 19,347 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 11 పాయింట్లు పెరిగి 65,087 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 262 పాయింట్ల నష్టంతో 44,232 వద్ద ముగిసింది. జియో ఫైనాన్స్, టాటా స్టీల్, మారుతీ, ఐచర్ మోటార్స్, ఎం అండ్ ఎం షేర్లు లాభపడ్డాయి. బీపీసీఎల్, పవర్ గ్రిడ్, హీరో మోటో, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు బలహీనపడి 82.73 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.330 పెరిగి రూ.60,000 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 పెరిగి రూ.77,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.200 పెరిగి రూ.25,870 వద్ద ఉంది. బిట్‌కాయిన్ రూ.22.66 లక్షల వద్ద కొనసాగుతోంది.