నిఫ్టీ 118 పాయింట్లు తగ్గి 19,659 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 440 పాయింట్లు పతనమై 66,266 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 383 పాయింట్లు తగ్గి 45,679 వద్ద స్థిరపడింది. సిప్లా, సన్‌ఫార్మా, దివిస్ ల్యాబ్, హీరో మోటో కార్ప్, అపోలో హాస్పిటల్స్ షేర్లు లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, టాటా కన్జూమర్, బ్రిటానియా, నెస్లే ఇండియా షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 81.95 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.330 పెరిగి రూ.60,490 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1100 పెరిగి రూ.81500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.60 పెరిగి రూ.25,520 వద్ద కొనసాగుతోంది. బిట్‌కాయిన్ 0.76 శాతం పెరిగి రూ.24.12 లక్షల వద్ద కొనసాగుతోంది.