నిఫ్టీ 97 పాయింట్లు పెరిగి 19,778 వద్ద క్లోజైంది. సెన్సెక్స్ 351 పాయింట్లు ఎగిసి 66,707 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 217 పాయింట్లు పెరిగి 46,062 వద్ద స్థిరపడింది. ఎల్‌టీ, సిప్లా, ఐటీసీ, బ్రిటానియా, సన్ ఫార్మా షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎం అండ్ ఎం, అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 13 పైసలు బలహీనపడి 82 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.160 పెరిగి రూ.60,160 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.400 పెరిగి రూ.77,400 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.190 పెరిగి రూ.25,460 వద్ద కొనసాగుతోంది. బిట్‌కాయిన్ రూ.23.93 లక్షల వద్ద కొనసాగుతోంది.