నిఫ్టీ 105 పాయింట్లు తగ్గి 18,665 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 259 పాయింట్లు తగ్గి 62,979 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 101 పాయింట్లు తగ్గి 43,622 వద్ద క్లోజైంది. ఇండస్‌ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఏసియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, ఎన్టీపీసీ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, హిందాల్కో, దివిస్ ల్యాబ్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.02 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.430 తగ్గి రూ.59,020గా ఉంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.71,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.680 తగ్గి రూ.24,220 వద్ద ఉంది. బిట్‌కాయిన్ రూ.24.65 లక్షల వద్ద ఉంది.