నిఫ్టీ 55 పాయింట్లు తగ్గి 19,310 వద్ద క్లోజైంది. సెన్సెక్స్ 202 పాయింట్లు తగ్గి 64,948 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 40 పాయింట్లు తగ్గి 43,851 వద్ద ముగిసింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఐచర్ మోటార్స్, మారుతీ, బ్రిటానియా షేర్లు లాభపడ్డాయి. హీరో మోటో, టెక్ మహీంద్రా, టీసీఎస్, హిందాల్కో, ఇన్ఫీ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు బలపడి 83.10 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల రూ.59,020 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1000 పెరిగి రూ.73500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.270 పెరిగి రూ.23,970 వద్ద ఉంది. బిట్ కాయిన్ ₹ 21,97,468 వద్ద ఉంది.