నిఫ్టీ 67 పాయింట్లు తగ్గి 18,688 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 310 పాయింట్లు పతనమై 62,917 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 544 పాయింట్లు పతనమై 43,443 వద్ద క్లోజైంది. అపోలో హాస్పిటల్స్, దివిస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, బీపీసీఎల్ షేర్లు లాభపడ్డాయి. హీరోమోటో, విప్రో, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, కొటక్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు బలహీనపడి 82.18 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ.59,670గా ఉంది. కిలో వెండి రూ.900 తగ్గి రూ.73,100 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.280 తగ్గి రూ.25,610 వద్ద ఉంది. బిట్‌కాయిన్ 3.98 శాతం తగ్గి రూ.20.44 లక్షల వద్ద కొనసాగుతోంది.