నిఫ్టీ 127 పాయింట్లు పెరిగి 18,726 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 350 పాయింట్లు పెరిగి 63,142 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 110 పాయింట్లు పెరిగి 44,275 వద్ద స్థిరపడింది. బ్రిటానియా, టాటా కన్జూమర్, బీపీసీఎల్, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు లాభపడ్డాయి. కొటక్ బ్యాంక్, సిప్లా, మారుతీ, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు పెరిగి 82.54 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.60,650గా ఉంది. కిలో వెండి రూ.73,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.40 పెరిగి రూ.27,510 వద్ద ఉంది. బిట్‌కాయిన్ 3.47 శాతం పెరిగి రూ.22.01 లక్షల వద్ద కొనసాగుతోంది.