నిఫ్టీ 5 పాయింట్లు పెరిగి 18,599 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 5 పాయింట్లు పెరిగి 62,792 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 62 పాయింట్లు పెరిగి 44,164 వద్ద స్థిరపడింది. అల్ట్రాటెక్ సెమ్, గ్రాసిమ్, దివిస్ ల్యాబ్, కొటక్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫీ, టీసీఎస్, విప్రో, ఓఎన్‌జీసీ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 6 పైసలు బలపడి 82.61 వద్ద స్థిరపడింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.320 పెరిగి రూ.60,650గా ఉంది. కిలో వెండి రూ.500 ఎగిసి రూ.73,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.27,470 వద్ద ఉంది. బిట్‌కాయిన్ రూ.21.30 లక్షల వద్ద ఉంది.