నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 19,611 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 100 పాయింట్లు పెరిగి 65,880 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 123 పాయింట్లు తగ్గి 44,409 వద్ద ముగిసింది. టాటా కన్జూమర్స్ (4.11%), దివిస్ ల్యాబ్ (1.77%), భారతీ ఎయిర్‌టెల్ (1.62%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (1.53%), బ్రిటానియా (1.44%) షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్ (1.71%), హిందాల్కో (1.65%), యాక్సిస్ బ్యాంక్ (1.48%), ఎన్టీపీసీ (1.32%), ఇండస్‌ఇండ్ బ్యాంకు (1.30%) షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు తగ్గి 83.13 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.160 పెరిగి రూ.60,000 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.74,700 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.610 తగ్గి రూ.24,640 వద్ద ఉంది. బిట్ కాయిన్ ₹ 21,40,513 వద్ద ఉంది.