నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 19,497 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 339 పాయింట్లు పెరిగి 65,785 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 188 పాయింట్లు పెరిగి 45,339 వద్ద స్థిరపడింది. ఎం అండ్ ఎం, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, రిలయన్స్ షేర్లు లాభపడ్డాయి. ఐచర్ మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, మారుతీ, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు తగ్గాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 27 పైసలు బలహీనపడి 82.22 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.59,160గా ఉంది. కిలో వెండి రూ.800 పెరిగి రూ.73,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.90 పెరిగి రూ.24,230 వద్ద ఉంది. బిట్‌కాయిన్ 2.12 శాతం పెరిగి రూ.25.63 లక్షల వద్ద ఉంది.