నిఫ్టీ 66 పాయింట్లు పెరిగి 19,389 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 274 పాయింట్లు పెరిగి 65,479 వద్ద ముగిశాయి. నిఫ్టీ బ్యాంక్ 143 పాయింట్లు పెరిగి 45,301 వద్ద స్థిరపడింది. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హీరోమోటో కార్ప్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా షేర్లు లాభపడ్డాయి. ఐచర్ మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, గ్రాసిమ్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 6 పైసలు బలహీనపడి 82.02 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.59,060గా ఉంది. కిలో వెండి రూ.200 తగ్గి రూ.71,700 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.210 పెరిగి రూ.24,020 వద్ద ఉంది. బిట్‌కాయిన్ 1.22 శాతం పెరిగి రూ.25.43 లక్షల వద్ద కొనసాగుతోంది.