ఇప్పుడు ప్రపంచం అంతా చిప్ తయారీదే ఆధిపత్యం. అందుకే అన్నింటినీ దాటేసి ఎన్వీడియా ప్రపంచంలో నెంబర్ వన్ కంపెనీగా ఎదిగింది.



రెండో స్థానంలో సాఫ్ట్ వేర్ విప్లవం తెచ్చిన మైక్రోసాఫ్ట్ నిలిచింది.



మూడో స్థానం ఆపిల్ కంపెనీది. ఐ ఫోన్లతో తన సంపదను పెంచుకుటూ పోతోంది.



నాలుగో స్థానం గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్‌దది. సుందర్ పిచాయ్ నేతృత్వం వహిస్తున్నారు.



ఐదో స్థానం అమెజాన్‌ది . ఈ కామర్స్, సాఫ్ట్ వేర్ తో పాటు అనేక బిజినెస్‌లు అమెజాన్‌కు ఉన్నాయి.



ఆరో స్థానంలో ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ వంటి సోషల్ మీడియా కింగ్స్ యజమాని అయిన మెటా నిలిచింది.



మొదటి ఆరు టెక్ కంపెనీలు, అన్నీ యూఎస్‌వే.కానీ ఏడో ప్లేస్‌లో సౌదీ అరామ్‌కో ఉంది. అది ఆయిల్ కంపెనీ.



ఎనిమిదో స్థానంలో చిప్ తయారీ సంస్థ TSMC ఉంది. ఇది తైవాన్ కంపెనీ.



తొమ్మిదో స్థానంలో సెమీ కండక్టర్ కంపెనీ అయిన బ్రాడ్ కామ్ ఉంది. ఇది కూడా అమెరికాదే.



పదో స్థానంలో బెర్క్ షైర్ హాత్ వే ఉంది. ఇది కంపెనీలను పెట్టదు. కానీ షేర్లను కొని కుబేర కంపెనీగా మారింది