జాబ్ వచ్చిందా. ఇంతకీ ఏం చేస్తున్నావు అని ఇంట్లో వారితో పాటు బంధువులు, స్నేహితులు అడుగుతుంటారు. కాస్త క్రియేటివ్ గా ఆలోచిస్తే ఉపాధి అనేది పెద్ద విషయం కాదని నిరూపిస్తున్నాడు ఓ యువకుడు. తన బుల్లెట్ బండిని మాడిఫై చేయించి మొబైల్ నాన్ వెజ్ బార్బెక్యూ సెంటర్ లా మార్చేశాడు. రామగుండంకు చెందిన మహమ్మద్ నిహాల్ స్వయంగా తనకంటూ ఒక బిజినెస్ ఉండాలని భావించాడు కాస్త క్రియేటివిటీని జోడించి ఓ బుల్లెట్ బండిని బార్బీ క్యూ సెటప్ చేసి, లైటింగ్ ఏర్పాటు చేశాడు నిహాల్ చికెన్ ప్రిపరేషన్ కోసం గ్యాస్ సిలిండర్ అవసరం లేకుండా మొత్తం కూడా బొగ్గుతోనే చేస్తున్నాడు చికెన్ ఐటమ్స్ ని మొత్తం ముందుగానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఉంచుతామని చెప్పాడు నిహాల్ ఫ్రెష్ చికెన్ తీసుకొచ్చి బొగ్గులపై తగినంత సమయం వరకు కాల్చడం ద్వారా క్రిస్పీగా.. టేస్టీగా ఉంటాయని తెలిపాడు వెబ్‌సైట్‌లో తనకు వచ్చిన రేటింగ్ చూసి కూడా ప్రజల ఆదరణ, రెస్పాన్స్ బాగుందన్నాడు క్రియేటివిటీకి.. కష్టం తోడైతే ఈ రోజుల్లో సాధ్యం కానిది ఏదీ లేదని ఈ యువకుడి స్టోరీ మనకు తెలియజేస్తోంది.