మాయ చేస్తున్న ఇనయా, ‘బిగ్ బాస్’లో ఆర్జీవీ భామదే పైచేయి! ఇనయా సుల్తానా? ఎవరీ అమ్మాయి? అదేనండి ఆర్జీవీతో అలా డ్యాన్స్ చేసిందే ఆమే ఈమె. అయితే, ఆర్జీవీ - ఇనయా డ్యాన్స్ వీడియో చూసినవాళ్లకు మాత్రమే ఆమె తెలుసు. కానీ, ఇప్పుడు ఇనయా అంటే అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఆమె ఒక ఫైర్ బ్రాండ్. ఎలాంటి అంచనాలు లేకుండా ఇనయా ‘బిగ్ బాస్’లో అడుగు పెట్టింది. తొలివారమే దాదాపు ఆమె ఎలిమినేట్ అయ్యేంత పనైంది. కానీ, లక్ కలిసొచ్చింది. మూడోవారం కూడా సేమ్ సీన్. కానీ, ఆడియన్స్ బతికించేశారు. ఇక నాలుగో వారం ఆమెను హౌస్‌లో ఉన్న తొమ్మిది మంది నామినేట్ చేశారు. తనని నామినేట్ చేసిన ప్రతి ఒక్కరికీ ఓపికగా సమాధానం చెప్పి ఔరా అనిపించింది. దీంతో ఇనయాను అంతా ఒంటరి చేస్తున్నారు. అది ఆమెకు క్రమేనా ప్లస్ అవుతోంది. అదే జరిగితే, ఇనయా లేడీ ‘కౌశల్’గా మారినా ఆశ్చర్యపోవక్కర్లేదు. త్వరలో ‘ఇనయా ఆర్మీ’ కూడా రావచ్చు. ఓటింగ్స్‌లో ఇనయా రెండో స్థానంలో ఉందట. ఈ వారం ఇనయా ఎలిమినేట్ కాకపోతే.. పాతుకుపోయినట్లే లెక్క! Images and Video Credit: Inaya Sultana/Instagram