ఒకప్పటి నేషనల్ క్రష్ భూమిక చావ్లాను ఎలా మరిచిపోగలం చెప్పండి. ఇప్పటికీ ఆమె తన అరనవ్వుతో కుర్రాళ్ల మతి పోగొడుతూనే ఉంది. ‘ఖుషీ’ సినిమా నుంచి తిరుగులేని తారగా ఎదిగిన భూమిక.. ఇప్పుడు సినిమాలు తగ్గించింది. అప్పుడప్పుడు అక్క, వదిన పాత్రల్లో కనిపిస్తూ భూమిక ఆకట్టుకుంటోంది. భూమిక ఇప్పుడు తన ఫ్యామిలీకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తోంది. తన భర్త, కొడుకుతో హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తూ.. ఎప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తుంది. భూమికాకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. తన ఫిట్‌నెస్ సీక్రెట్ కూడా ఇదేనట. భూమిక చాలా ధైర్యవంతురాలు కూడా. తాజాగా ఆమె ఓ పామును చేత్తో పట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. Images and Videos Credit: Bhumika Chawla/Instagram