రోజూ కచ్చితంగా తినాల్సిన ఆహారంలో పెరుగు కూడా ఒకటి.
సాధారణ పెరుగు కన్నా కాస్త పులిసిన పెరుగు ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.
రోజూ పులిసిన పెరుగు తినడం మంచిది కాదు కానీ, అప్పుడప్పుడు తినడం వల్ల శరీరానికి అవసరమైన మంచి బ్యాక్టిరియా పుష్కలంగా అందుతుందని అంటున్నారు.
పొట్ట, పెద్ద పేగులకు మేలు చేసే ఎసినోఫిలస్, లాక్టోబాసిలస్, బిఫిడో వంటి మంచి బ్యాక్టిరియాలు సాధారణ పెరుగు కన్నా పుల్లని పెరుగులోనే పుష్కలంగా ఉంటాయి.
పులిసిన పెరుగు అధికంగా తినడం వల్ల, రోజూ తినడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొందరిలో గ్యాస్టిక్ సమస్య రావచ్చు. కాబట్టి మూడు రోజులకోసారి పులిసిన పెరుగు తినేందుకు ప్రయత్నించండి.
హైబీపీ ఉన్న వారు సాధారణ పెరుగు తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది.
మహిళలు పెరుగు తినడం వల్ల జననాంగాలలో వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.