ఏప్రిల్ 23 రాశి ఫలితాలు



మేషం
కార్యాలయంలో మీ పనితీరు బాగుంటుంది. అధికారులు మీపట్ల సానుకూలంగా ఉంటారు.విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారులకు బాగానే ఉంటుంది. మీ ప్రణాళిక ప్రకారం అన్ని పనులు జరుగుతాయి.



వృషభం
ఈ రాశి వారు అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. మీరు దాతృత్వ కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్య నుంచి మీరు ఉపశమనం పొందుతారు.మీ నైపుణ్యాన్ని వినియోగించుకుంటారు.



మిథునం
పెండింగ్ పనులు పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. పాత సమస్యలు మళ్లీ తలెత్తడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. మీ ప్రవర్తన పరస్పర సంబంధాలను ప్రభావితం చేస్తుంది. ఆహారాన్ని మితంగా తినండి. ఈరోజు ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి.



కర్కాటకం
కార్యాలయంలో పెద్ద ప్రాజెక్ట్ పొందవచ్చు. ఆఫీసులో మీ ఇమేజ్ మెరుగవుతుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. అవివాహితులకు వివాహం కుదురుతుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి అవకాశాలను పొందుతారు.



సింహం
యువకులు తమ వృత్తికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. బిజీ కారణంగా కొన్ని ముఖ్యమైన పనులకు అంతరాయం కలుగుతుంది. తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఉంటుంది. ఒత్తిడి తీసుకోకండి.



న్యా
ఎండలో బయట తిరగొద్దు. సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించండి. ఒత్తిడిని నివారించడానికి సంగీతాన్ని ఆస్వాదించండి.ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ఇంట్లో ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. మీరు విదేశాలకు వెళ్లే విషయంలో గందరగోళానికి గురవుతారు



తులా
ఆఫీసులో ఓపికగా,ప్రశాంతంగా పని చేయాలి. తొందరగా అలసిపోతారు. ప్రాణాయామం చేయడం ద్వారా ఉపశమనం పొందుతారు.ఇంటి పెద్దలను నిర్లక్ష్యం చేయవద్దు. వివాహ కార్యక్రమాలకు ఆటంకం కలగొచ్చు.



వృశ్చికం
మీరు కష్టమైన పనులను సులభంగా పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యలు చాలా వరకు దూరమవుతాయి. సాంకేతిక రంగానికి సంబంధించిన వ్యక్తులు మంచి విజయాన్ని పొందుతారు. స్వల్ప దూర ప్రయాణాలకు రోజు అనుకూలం.



ధనుస్సు
టెన్షన్ తగ్గుతుంది. మిమ్మల్ని ఎవరైనా చెడుగా భావించవచ్చు. ఇతరుల లోపాల కంటే మీపై దృష్టి పెట్టండి. ఇంటి సభ్యుల మధ్య సమన్వయం తక్కువగా ఉంటుంది. మీ సూచనలు కార్యాలయంలో చాలా సముచితమైనవిగా పరిగణిస్తారు. చదువులో కొంత ఆటంకాలు ఏర్పడవచ్చు.



మకరం
ప్రశాంతంగా, ఓర్పుతో పని చేయండి. మీకు కార్యాలయంలో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.ఈ రోజు మీరు చాలా క్రమశిక్షణతో ఉంటారు.ప్రత్యర్థులు యాక్టివ్ గా ఉంటారు..వారినుంచి మీకు హాని కలగొచ్చు. పెండింగ్‌లో ఉన్న కేసులు ఈరోజు పూర్తి కానున్నాయి.



కుంభం
మీ అభిప్రాయాన్ని ఎవరిపైనా రుద్దకండి. సహోద్యోగులతో విభేదాలు రావొచ్చు. ఆలోచించకుండా పెద్ద ఆర్థిక ఒప్పందాలు చేయకండి. పరిస్థితులను బట్టి మీ స్వభావాన్ని మార్చుకోండి. దాంపత్య సంబంధాలు బావుంటాయ్.



మీనం
ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మెరుగ్గా పనిచేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి. వ్యాపారం బాగా సాగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు.