గలగల పారే నది... ఆ నది ఒడ్డు వెంబడి చిన్న గ్రామం. ఇళ్లన్నీ ఒడ్డునే ఉండడం ఈ గ్రామం విశేషం.
నిత్యం ఆ గ్రామానికి పర్యాటకులు తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడదే ఆ ఊరి సమస్యగా మారిపోయింది.
ఈ అందమైన గ్రామం ఉన్నది ఆస్ట్రియా దేశంలో. పేరు ‘హాల్‌స్టట్’.
ఎందుకిలా పర్యాటకులు రోజూ వందల్లో వచ్చిపడతారో తెలుసా? ఇన్‌స్టా పోస్టుల కోసం.
విలేజ్ బ్యాక్‌గ్రౌండ్లో ఇన్‌స్టా రీల్స్, ఫోటోలు తీసుకుని పోస్టు చేస్తే వాటికొచ్చే లైకులు, షేర్లు మామూలుగా ఉండవు. అందుకే ఈ గ్రామం ‘ఇన్‌స్టాగ్రామ్ విలేజ్’ గా పేరు తెచ్చుకుంది.
టూరిస్టుల తాకిడి తట్టుకోలేక ఇకపై వచ్చే వారికి నియమ నిబంధనలు ఏర్పాటుచేయాలనుకుంటున్నట్టు గ్రామపెద్దలు చెబుతున్నారు.
ఈ గ్రామజనాభా కేవలం 800.
ఈ గ్రామానికి ఎప్పుడో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు సాధించింది.