క‌రివేపాకే క‌దా అని తీసి పారేస్తారు చాలామంది. కానీ, దాంట్లోనే ఎన్నో పోష‌కాలు ఉంటాయి.

క‌రివేపాకు తిన్నా, కరివేపాకు నీళ్లు తాగిన శ‌రీరానికి చాలా మంచిది.

క‌రివేపాకును బాగా నీటిలో మ‌రిగించి.. ఆ త‌ర్వాత వ‌డ‌క‌ట్టి.. నీటిని తాగితే శ‌రీరానికి ఎన్నో పోష‌కాలు అందుతాయి.

కరివేపాకు లాక్సిటివ్స్ గ్యాస్, మలబద్ధకం, డయేరియా , అజీర్ణం వంటి సమస్యల నుంచి రక్షిస్తుందట.

క‌రివేపాకు జుట్టుకు చాలామంచిది. దాంట్లో ఉండే పోష‌కాలు జుట్టు రాల‌కుండా చేస్తాయి. మెరిసేలా చేస్తాయి.

ఆ ఆకుల్లో ఉండే విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇన్ఫెక్ష‌న్లు, రోగాలు రాకుండా చేస్తాయి.

క‌రివేపాకు నీళ్లు డయాబెటిస్ పేషంట్ల‌కు చాలా మంచిది. షుగ‌ర్ కంట్రోల్‌లో ఉంటుంది.

వెయిట్ త‌గ్గాల‌నుకునే వాళ్లు.. డైట్ తో పాటు క‌రివేపాకు నీళ్లు తాగితే బ‌రువు త‌గ్గుతారు.

క‌రివేపాకు నీళ్లు శరీరంలోని చెడు మొత్తాన్ని బ‌య‌టికి పంపి.. ఆరోగ్యంగా ఉంచుతుంది.

Image Source: Unsplash & Pexels

పని ఒత్తిడి, టెన్షన్‌, డిప్రెషన్‌ నుంచి కరివేపాకు నీరు ఉపశమనం కలిగిస్తుంది. (నోట్: డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి)