కారు కొనే సమయంలో చాలా విషయాలు పరిగణలోకి తీసుకుంటారు. అందులో రేంజ్‌ను కూడా చూస్తారు.
టెస్లా భారతదేశంలో తన మొదటి షోరూమ్‌ను 15 జూలై 2025న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ప్రారంభించింది.
టెస్లా కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ SUV మోడల్ Y ని భారత్‌లో రూ. 59.89 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది.
మోడల్ Y రెండు వేరియంట్‌లలో వచ్చింది. RWD (రియర్ వీల్ డ్రైవ్) అండ్ లాంగ్ రేంజ్.
RWD వేరియంట్ 60 kWh బ్యాటరీతో వస్తుంది, ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 500 km (WLTP రేంజ్) ఇస్తుంది. లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీతో వస్తుంది, ఇది 622 km వరకు రేంజ్ ఇస్తుంది.
టెస్లా సూపర్ ఛార్జర్‌తో కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో 238 నుంచి 267 కిలోమీటర్ల వరకు రేంజ్ పొందవచ్చని పేర్కొంది.
ఫైనల్ ప్రైస్ గురించి మాట్లాడితే RWD వేరియంట్ ధర 6107190, లాంగ్ రేంజ్ వేరియంట్ ధర 6915190, ఇందులో GST కూడా ఉంది.
పనితీరు పరంగా RWD వెర్షన్ 0 నుంచి 100 kmph వేగాన్ని 5.9 సెకన్లలో అందుకుంటుంది, లాంగ్ రేంజ్ వెర్షన్ 5.6 సెకన్లలో ఈ దూరాన్ని చేరుకుంటుంది.
RWD వర్షన్‌లో ఒక సింగిల్ మోటర్ ఉంది, అది 295 హార్స్‌పవర్ పవర్ కలిగి ఉంది.
వినియోగదారుల ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (FSD) ఫీచర్ తీసుకోవాలనుకుంటే, దీని కోసం అదనంగా 6 లక్షల రూపాయలు చెల్లించాలి.