కారు టైర్లపై రాసి ఉండే సంఖ్యలు కేవలం అంకెలు అనుకుంటే పొరపాటే. మీ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారం.

Published by: Shankar Dukanam
Image Source: pexels

195/55 R16 87V వంటి సంకేతాలు టైర్ పూర్తి గుర్తింపును అందిస్తాయి.

Image Source: pexels

195 అనేది మీ కార్ టైర్ వెడల్పును మిల్లీమీటర్లలో సూచిస్తుంది.

Image Source: pexels

55 అనేది, టైరు ఎత్తు వెడల్పులో 55% అని సూచిస్తుంది.

Image Source: pexels

R అనేది రేడియల్ నిర్మాణం (Radial construction) కు సంకేతం. మోడ్రన్ కార్లలో ఇది సాధారణమైన రకం.

Image Source: pexels

16 అనేది ఆ టైర్ 16 అంగుళాల రిమ్‌కు సరిపోతుందని సూచిస్తుంది.

Image Source: pexels

టైర్ లోడ్ ఇండెక్స్ — ఉదాహరణకు 87 అయితే దాని గరిష్ట బరువు మోసే సామర్థ్యాన్ని సూచిస్తుంది.

Image Source: pexels

87 లోడ్ ఇండెక్స్ కలిగిన టైరు. ఇది దాదాపు 545 కిలోగ్రాముల బరువును మోయగలదు.

Image Source: pexels

V అనేది వేగపు రేటింగ్.. ఇది గంటకు 240 కి.మీ వరకు సేఫ్ స్పీడ్ సూచిస్తుంది.

Image Source: pexels

టైర్లను కొనుగోలు చేసే ముందు, ఈ సంఖ్యలను తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే సరైన టైర్లే సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తాయి.

Image Source: pexels