ఆగస్టు 25న 'లైగర్' ఉండటంతో ఈ వారం పెద్ద సినిమాలు ఏవీ రావడం లేదు. ఆరు చిన్న చిత్రాలు వస్తున్నాయి. ధనుష్, నిత్యా మీనన్, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా నటించిన 'తిరు' ఆగస్టు 18న విడుదలవుతోంది. అనసూయ, సునీల్, 'సుడిగాలి' సుధీర్, 'వెన్నెల' కిశోర్, తదితరులు నటించిన వాంటెడ్ పండుగాడ్' విడుదల ఆగస్టు 19న. ఆది సాయికుమార్, పాయల్ జంటగా నటించిన 'తీస్ మార్ ఖాన్' విడుదల కూడా ఆగస్టు 19నే. తేజస్వి, అన్వేషి జైన్, రమ్యా పసుపులేటి నటించిన 'కమిట్‌మెంట్' ఆగస్టు 19న విడుదలకు రెడీ అయ్యింది. 'మాటరాని మౌనమిది', 'అం అః', 'లవ్ 2' అనే మరో మూడు సినిమాలు కూడా ఆగస్టు 19న విడుదల అవుతున్నాయి. గత వారం విడుదలైన 'కార్తికేయ 2' థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తోంది. 'బింబిసార'కు కూడా ఇంకా వసూళ్లు వస్తున్నాయి. అందువల్ల, 'లైగర్' విడుదలైన తర్వాతే పెద్ద సినిమాలు రావచ్చు.