మకర రాశి వార ఫలాలు ( మార్చి 17 - 23) ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు కార్యాలయంలో పని ఒత్తిడి మాత్రం తప్పనిసరిగా ఉంటుంది కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది కానీ చిన్న చిన్న చర్చలు జరుగుతాయి స్నేహితుల నుంచి ఓ శుభవార్త వింటారు వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్తపడండి వారం ఆరంభం కన్నా వారాంతం అంతగా బాలేదు ఈ వారం మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది